వైసీపీకి 15 సీట్లు రావడం కాదు.. పవన్ కళ్యాణ్ కు 15 మంది అభ్యర్ధులు కూడా లేరని ఏపీ మంత్రి రోజా సెటైర్లు పేల్చారు. మాకు 175 స్దానాలకు అభ్యర్ధులు ఉన్నారు…మళ్ళీ జగనే సిఎం అని స్పష్టం చేశారు. మహిళా గౌరవించాల్సిన బాద్యత అందరిపైనా ఉందని.. టిడిపి నేతలు సంస్కారం లేకుండా ,అవమానం పరిచేలా మాట్లాడుతూన్నారని వివరించారు. ఇలాంటి వారికి న్యాయస్థానంలో శిక్ష పడుతుందన్నారు రోజా. అటు చంద్రబాబుపై మరోసారి మంత్రి రోజా విరుచుకుపడ్డారు.
గాడ్సే కంటే ఘోరమైన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. గాంధి గారికి ఘోరమైన అవమానం పరిచేలా దీక్ష చేస్తున్నారు… దీన్ని మేము ఖండిస్తున్నామంటూ చురకలు అంటించారు. ప్రజలు చంద్రబాబును తరిమికొట్టాలని పిలుపునిచ్చారు ఏపీ మంత్రి రోజా. ప్రజల డబ్బు దోచుకుని దీక్ష పేరుతో అమరవీరులను అవమానపరుస్తున్నారని ఫైర్ అయ్యారు ఏపీ మంత్ర రోజా.స్వాతంత్ర్య అమరవీరులను ప్రతిరోజు గుర్తించుకోవాలని కోరారు. తిరుపతి, విజయవాడ, వైజాగ్ లు కూడా అమరవీరుల ట్రిబ్యూట్ వాల్ ఏర్పాటు చేస్తాం..అమరవీరుల ట్రిబ్యూట్ వాల్ ఒక గోడ కాదు ఒక గుడిలా భావించాలన్నారు.