రోజాకు వైసీపీలో మ‌రో శ‌త్రువు.. అక్కా చెల్లి మ‌ధ్య అస్స‌లు ప‌డ‌ట్లేదా…!

-

రోజాకు వైసీపీలో మ‌రో శ‌త్రువు.. అక్కా చెల్లి మ‌ధ్య అస్స‌లు ప‌డ‌ట్లేదా…!వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్ కే రోజాకు రోజురోజుకు సొంత పార్టీలోనే శత్రువులు పెరిగిపోతున్నారు. బలమైన వాయిస్ వినిపించడంతో పాటు ఎప్పుడు దూకుడుగా ఉంటూ మీడియాలో హైలెట్ అయ్యే రోజా అంటే సొంత పార్టీలోనే చాలామంది నేతలకు గిట్టటం లేదు. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకు జగన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మంత్రి పదవి ఇవ్వాలని అనుకున్నారు. అయితే సామాజిక సమీకరణలు కలిసి రాకపోవడంతో ఆమెకు మంత్రి పదవి ఇవ‌వ్వ‌క‌పోయినా జగన్ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఏపీఐఐసి చైర్మన్ పదవిని కట్టబెట్టారు. రెండున్నర ఏళ్ల తర్వాత జరిగే క్యాబినెట్ ప్రక్షాళనలో మహిళా కోటాలో తనకు ఖ‌చ్చితంగా మంత్రి పదవి వస్తుందన్న ధీమాతో రోజా ఉన్నారు. మంత్రి పదవి లేకుండానే రోజా మీడియాలో ఎంత హైలెట్ అవుతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఒకవేళ రేపు రోజాకు మంత్రి పదవి ఇస్తే వైసిపిలో ఉన్న చాలా మంది సీనియర్ నేతలను ఆమె సులువుగానే డామినేట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా కీలక నేతగా ఎదిగిన పోతారు అన్న ఆందోళనలో ఆ సీనియర్ నేతలు ఉన్నారు. ఈ క్రమంలోనే రోజాను రాజకీయంగా అణగదొక్కేందుకు వారు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓ సీనియర్ మంత్రి రోజాను పదేపదే ఇబ్బంది పెట్టేలా ఎప్పటినుంచో పావులు క‌దుపుతున్నార‌న్న టాక్‌ ఉంది. రోజా సైతం సదరు మంత్రిపై జగన్‌కు, పార్టీ కీలక నేతల‌కు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా సదరు సీనియర్ మంత్రి పార్టీకి ఆర్థిక వ్యవహారాల్లో కీలకంగా ఉండడంతో జగన్ సైతం ఆయనను ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది.

ఇప్పటి వరకు సదరు సీనియర్ మంత్రితో పాటు మరో మంత్రి సైతం రోజాకు చెప్పకుండా ఆమె నియోజకవర్గంలో పర్యటిస్తూ ఇబ్బంది పెడుతూ వచ్చారు. ఇక ఇప్పుడు సొంత పార్టీలోనే రోజాకు మరో శత్రువు తయారైందన్న ప్రచారం నగరి రాజకీయాల్లో వినిపిస్తోంది. నగ‌రిలో స్థానికంగా గట్టి పట్టున్న కేజే. కుమార్ దంపతులతో ఇప్పుడు రోజాకు అస్సలు ప‌డ‌డం లేదు. కేజే.కుమార్ ఆయన భార్య శాంతి ఇద్దరూ కూడా నగ‌రి మున్సిపల్ ఛైర్మన్లుగా పని చేశారు. 2014 ఎన్నికల్లో కుమార్ వర్గం రోజా గెలుపు కోసం బాగా కష్టపడింది.

ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు రావడం కుమార్‌కు మంత్రి పెద్దిరెడ్డి సపోర్టు ఉండడంతో… రోజాకు కేజీ కుమార్ దంపతులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అక్క చెల్లెలుగా పేరు తెచ్చుకున్న‌ రోజా, శాంతి ఇప్పుడు పరస్పరం దూషించుకునే పరిస్థితి వచ్చేసింది. తాజాగా శాంతికి నామినేటెడ్ పదవి దక్కడం వెనక మంత్రి పెద్దిరెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తూ రోజా వర్గం ఇప్పుడు వాళ్ళ పై మరింత గుర్రుగా ఉంది. ఏదేమైనా రోజాకు వైసీపీలో రోజురోజుకు శ‌త్రువ‌ర్గం పెరిగిపోతోంది అన్నది వాస్తవం.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Exit mobile version