పవన్ కళ్యాణ్ పొత్తు వ్యాఖ్యలపై రోజా సంచలన వ్యాఖ్యలు..భార్య ఉండగా వేరే అమ్మాయితో ! !

-

పవన్ కళ్యాణ్ పొత్తు వ్యాఖ్యలపై రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ జెండా చంద్రబాబు ప్యాకేజీ అని.. అజెండా చంద్రబాబు, లోకేష్ కు బానిసగా బతకటం అంటూ రెచ్చిపోయారు మంత్రి రోజా. భార్య ఉండగా వేరే అమ్మాయితో పిల్లలను కంటే ఎలా ఉంటుందో ఆలోచించండి అని రేణు దేశాయ్ గతంలో జన సైనికులకు చెప్పారు…ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటనతో రేణు దేశాయ్ వ్యాఖ్యలు గుర్తుకు వస్తున్నాయని చురకలు అంటించారు.

Roja’s sensational comments on Pawan Kalyan’s alliance comments

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవటం సన్యాసి, సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుంది లాంటిదేనని.. చంద్రబాబు సంగతి బీజేపీకి తెలుసు అన్నారు. బీజేపీతో చర్చించకుండా టీడీపీతో అని పవన్ కళ్యాణ్ ప్రకటించటం పొత్తు ధర్మానికి తూట్లు పొడవటమే అంటూ ఫైర్‌ అయ్యారు. 2018లోనే స్కిల్ కుంభకోణం బయటపడిందని… చంద్రబాబు తప్పు చేయలేదని నమ్మితే సీబీఐ, ఈడీ విచారణ చేయమని లేఖ రాయాలని పేర్కొన్నారు. ఢిల్లీ వెళుతున్న లోకేష్ అక్కడే ఉన్న ఈడీ, సీబీఐ ఆఫీసుకు వెళ్ళి ఈ కుంభకోణాల పై విచారణ చేయాలని లేఖ ఇవ్వాలన్నారు. ఎకరం భూమి నుంచి వేల కోట్లు చంద్రబాబు వేల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయని.. వ్యవస్థల్లో చంద్రబాబు మనుషులు ఉండటం వల్లే ఇన్నేళ్ళు తప్పించుకుని తిరిగాడని చెప్పుకొచ్చారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల వేదికగా చంద్రబాబు స్కాం లను ప్రజలకు వివరిస్తామని మంత్రి రోజా అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version