పులివెందుల కాబోయే ఎమ్మెల్యే బీటెక్ రవి అని కడప జిల్లా ప్రజలే కాదు… రాయలసీమ ప్రజలు కూడా నిర్ధారించుకున్నారని రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో ఆ జన ప్రభంజనం చూస్తే, బీటెక్ రవి గారికి ఉన్న ప్రజాదరణ ఏ పాటిదో అర్థమవుతుందని, పులివెందుల నిజమైన పులి బీటెక్ రవి అని అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒకవైపు చంద్రబాబు నాయుడు తిరుగుతుండగానే, మరొకవైపు ఎల్లుండి నుంచి పవన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాలలో పర్యటించనున్నారని, తాను కూడా త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నానని అన్నారు. తనను కూడా దుప్పి అని అనుకుంటున్నారేమో, తిరగబడి సింహాన్ని కూడా పొడిచి వేయగలనని రఘురామకృష్ణ రాజు హెచ్చరించారు. అమరావతి ఆర్ 5 జోన్ లో ఇళ్ళ నిర్మాణానికి ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి వీలు లేదని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించిందని, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా జగన్ కాటుకు హైకోర్టు దెబ్బ తగిలిందని అన్నారు.