జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో లోపాలు, అవకతవకల కట్టడికి కేంద్రం తీసుకున్న చర్యలతో రాష్ట్ర ప్రభుత్వ అంచనాలు తలకిందులు అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఈ ఏడాది ఇప్పటివరకు రూ. 608 కోట్లకు పైగా మెటీరియల్ కాంపోనెంట్ నిధుల్లో కోతపడింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను నేషనల్ ఇన్ఫర్మటిక్స్ సెంటర్ పోర్టల్ కి అనుసంధానించింది.
కూలీల హాజరుపై ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన జాతీయ మొబైల్ పర్యవేక్షణ విధానం యాప్ ను ఈ నెల 1 నుంచి తప్పనిసరి చేసింది. దాంతో అంచనాలన్నీ తారుమారయ్యాయి. అటు ఈ ఏడాది మరో ఐదు కోట్ల ఆదరణ పని దినాల కోసం కేంద్రంపై రాష్ట్రం ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రెండు విడతలుగా 19 కోట్ల పని దినాలను కేంద్రం కేటాయించింది. వీటిలో 90 శాతానికి పైగా వినియోగించుకున్నామని, ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చిలోగా ఆదనపు కేటాయింపులు చేయాలని కోరుతుంది.