ఆంధ్ర ప్రదేశ్ వలంటీర్లకు సీఎం జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. వలంటీర్లకు ప్రతినెలా అదనంగా రూ.750 ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇంటింటికీ రేషన్ పంపిణీ పర్యవేక్షణకు ప్రోత్సాహకం ఇవ్వనుంది జగన్ మోహన్ రెడ్డి సర్కార్.
ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు పౌరసరఫరాల శాఖ లేఖ రాసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అధికారులందరికీ ఈ మేరకు ఆదేశాలు వెళ్లాయి. ఎప్పటి నుంచి ప్రోత్సాహకం వర్తింపజేయనున్నారో త్వరలో వెల్లడిస్తారు. ఇప్పటికే వలంటీర్లకు ప్రతి నెలా రూ.5,000 చొప్పున గౌరవ వేతనం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి.
అటు కడప ఉక్కుకు కదలిక వచ్చింది. ఇందులో భాగంగానే సీఎం జగన్ తో సజ్జన్ జిందాల్ భేటీ అయ్యారు. తొలి విడత పనులపై CM జగన్ ఆరా తీశారు. జనవరి నుంచి పనులు ప్రారంభానికి హామీ ఇచ్చారు. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం వైపు నుంచి రూ.650 కోట్లు ఖర్చు చేస్తున్నారు.