రెండు రోజుల క్రితం నెల్లూరు జిల్లాకు చెందిన కావలి టౌన్ బై పాస్ లో దారుణమైన ఘటన జరిగింది. విజయవాడ డిపోకు చెందిన బస్ కావాలి నుండి విజయవాడకు వెళుతోంది, కావాలి ట్రంక్ రోడ్ దగ్గర ఆర్టీసీ డ్రైవర్ ముందున్న బైక్ ను పక్కకు తీయాలంటూ కొట్టాడు. అయితే హారన్ తో విసుగు చెందిన బైక్ వ్యక్తి బస్సు డ్రైవర్ తో గొడవకు దిగాడు. ఇంతలో అక్కడే ఉన్న పోలీసులు వారిద్దరికీ సర్ది చెప్పి బస్సు ను పంపించేశారు. కానీ అంతటితో సంతృప్తి చెందని బైక్ వ్యక్తి తన మిత్రులకు వెంటనే ఫోన్ చేసి మొత్తం 14 మంది బసును వెంబడించారు.
వేరు సరిగ్గా మద్దూరు పాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ దగ్గర బస్సును ఆపి, మళ్ళీ డ్రైవర్ తో గొడవకు దిగి విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న కావలి సీఐ అక్కడికి చేరుకొని డ్రైవర్ ను హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాదానికి కారణం అయిన నిందుతుల గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది.. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ ఘటనకు కారణం అయిన వారంతా ఎవరు అంటూ సామాన్యులు తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక ఏపీలో టీడీపీ బ్యాచ్ అంతా ఈ ఘటనకు కూడా వైసీపీ కారణం అంటూ చూపించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
కానీ కొన్ని చివరకు సమాచారాన్ని సేకరించిన తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే… ఈ ఘటనలో భాగం అయిన వారిలో కీలకంగా వ్యవహరించిన గుర్రంకొండ సుధీర్, గుర్రంకొండ అరుణ్ కుమార్, శివారెడ్డి మరియు గంజి ప్రసన్నలుగా తెలుస్తోంది. ఇక వీరి బయోడేటా ను చూస్తే ప్రస్తుతం టీడీపీ మరియు జనసేన పార్టీలలో ఉంటున్నారు.
కాగా వీరు ఇలా దాడులకు పాల్పడడం ఇదేమి మొదటిసారి కాదు..గతంలో వీరిపై కొన్ని క్రిమినల్ కేసులు నమోదు అయి ఉన్నాయి. గుర్రంకొండ సుదీర్ బాబు పై 21 కేసులు, కిషోర్ పై కేసులు , గుర్రంకొండ అరుణ్ కుమార్ పై 2 కేసులు, కర్రేడుల విజయ్ కుమార్ పై 9 కేసులు మరియు పుట్ట శివకుమార్ రెడ్డి పై 8 కేసులు నమోదు అయి ఉన్నాయి. ఇవన్నీ మీడియాలో బయటపడిన తర్వాత అయినా సమాజానికి బ్రష్టుపట్టిన ఇలాంటి అసాంఘిక శక్తులను ఏరిపారేస్తారని ఆశిస్తున్నాము.