సంక్రాంతికి ఊరేళ్లే వారికి RTC అదిరిపోయే శుభవార్త..డిస్కౌంట్లో టికెట్లు !

-

సంక్రాంతికి ఊరేళ్లే వారికి RTC అదిరిపోయే శుభవార్త. సంక్రాతికి ఊరు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా, మీకో శుభవార్త. ఏపీఎస్ ఆర్టీసీ ఆన్లైన్ బుకింగ్స్ ప్రారంభించినట్లు తెలిపింది. 2023 సంక్రాంతికి సంబంధించి బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి అంటూ ఆర్టీసీ ట్విట్ చేసింది.

ఏపీఎస్ఆర్టీసీ http://apsrtconline.in వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాలని సూచించింది. అంతే కాదు సాధారణ చార్జీలతో బస్సులో ప్రయాణించండి. రౌండ్ ట్రిప్ బుక్ చేసుకుంటే 10% డిస్కౌంట్ కూడా పొందొచ్చని తెలిపింది. సంక్రాంతికి ఊరు వెళ్లాలని భావిస్తున్న ప్రయాణికులు త్వరగా టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version