వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోండని.. మీ సమస్యల పరిష్కారానికి జనసేన నిలబడుతుందని నమ్మితే జనసేన పార్టీకి ఓటు వేయండని పవన్ కళ్యాణ్ కోరారు. సమస్యలపై నిలబడే సత్తా ఉండే నాయకులను నిలబెట్టండని.. మీరు నాయకత్వం పెంచుకోకపోతే కొద్దిమంది వ్యక్తుల సమూహానికి లొంగాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక మంత్రితో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు తూర్పుకాపుల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారని.. ఏ ఒక్కరు కూడా మీ సమస్యను పరిష్కరించే పరిస్థితి లేదని వెల్లడించారు.
మంత్రి అయిన బొత్స సత్యనారాయణ గారు కూడా మీ సమస్యలను అధినాయకత్వానికి చెప్పడం తప్ప చేసేది ఏమీ లేదని..ఆయన పరిస్థితే అలా ఉంటే ఇక మీ పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోండని కోరారు. తెలంగాణలో పర్యటించినప్పుడు బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని..నేను వాళ్లలా తేనే పూసిన కత్తిని కాదని చెప్పారు. తియ్యని అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేయనని.. ఒక్క సినిమాను ఆపడానికి వాళ్లు యంత్రాంగాన్ని అంతా ఉపయోగించినప్పుడు.. తూర్పు కాపులకు ఓబీసీ సర్టిపికేట్ ఇవ్వడానికి మనం ఎందుకు యంత్రాగాన్ని వాడకూడదని వెల్లడించారు పవన్ కళ్యాణ్.