Sailajanath: ఏపీలో కాంగ్రెస్‌ ఖాళీ..త్వరలోనే వైసీపీలోకి వాళ్లు కూడా !

-

Shyalajanath: ఏపీలో కాంగ్రెస్‌ ఖాళీ అవుతుందని….త్వరలోనే వైసీపీలోకి వాళ్లు కూడా వస్తారన్నారు శైలజానాథ్‌. వైసీపీలో చేరారు మాజీ మంత్రి శైలజానాథ్. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ సమక్షంలో పార్టీలో చేరారు శైలజానాథ్. వైసీపీ కండువా వేసి శైలజానాథ్‌ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు జగన్.

Sailajanath

ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ… జగన్ రాజకీయ విధానాలు నచ్చటం వల్లే వైసీపీలో చేరానని.. కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అవలంబిస్తుందని ఆగ్రహించారు. ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చటం లేదని వెల్లడించారు.

ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని… రాయలసీమలో ప్రజల కష్టాలు తీర్చేందుకు నా వంతు పనిచేస్తానని ప్రకటించారు. రాజకీయాలు ప్రజా ప్రయోజనాల కోసం చేయాలే కానీ ఆర్ధిక ప్రయోజనాల కోసం కాదని వెల్లడించారు. కాంగ్రెస్ నుంచి మరికొందరు నేతలు వచ్చే అవకాశం ఉంది.. ఎవరెవరు వస్తారనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. జగన్ ఏ బాధ్యత అప్పగించినా నా శక్తి మేరకు పనిచేస్తానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news