బలమైన ఆధారాలతోనే చంద్రబాబు అరెస్టు అయినట్లు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. చంద్రబాబు అరెస్టు లో అసలు విషయం పక్కకు వెళ్ళిలా టీడీపీ నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని.. ఎలాంటి దురుద్దేశాలు లేవని చురకలు అంటించారు. బలమైన ఆధారాలతోనే సిట్ ఏర్పాటు చేశామని… జగన్ ప్రభుత్వం ఎంతో సంయమనంతో ఉందని వెల్లడించారు.
దర్యాప్తు సంస్థలు ఎంతో స్వేచ్చగా దర్యాప్తు చేస్తున్నాయని.. స్వాతంత్ర్య భారత దేశంలో అత్యంత హేయమైన ఆర్ధిక నేరం అంటూ ఆగ్రహించారు సజ్జల. స్కీం పేరుతో స్కాం చేశారని..ఆర్ధిక నేరాల్లో నోటీసు ఇవ్వాల్సి అవసరం లేదన్నారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేదని చంద్రబాబు ఎవరిని దబాయిస్తున్నాడు?? ఈ స్కాం లో చంద్రబాబు పాత్ర ఉందన్నది అందరికీ తెలిసిన విషయం అని పేర్కొన్నారు.వ్యక్తిగతం కక్ష సాధింపుకు వెళ్ళని స్వభావం జగన్ దన్నారు. దర్యాప్తులో తేలాలి రాజకీయ ప్రమేయం ఉండకూడదనే రెండేళ్లు ఆగారు…దబాయించి బయట పడాలని చూస్తే ఇంకా సాధ్యం కాదని హెచ్చరించారు సజ్జల.