చంద్రబాబుతో నడిచే ఏ, బీ, సీ టీంలు చేసే ప్రచారంతో మేము పోటీ పడలేమని సీరియస్ అయ్యారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. శాసనమండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు కొత్తగా ఎన్నికైన సభ్యులు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. సామాజిక న్యాయంలో చంద్రబాబువి సున్నా మార్కులు అని.. చంద్రబాబు మోసానికి, వెన్నుపోటు కు ట్రేడ్ మార్క్ అని ఫైర్ అయ్యారు.
చంద్రబాబు వెనుక నడిచే ఏ, బీ, సీ టీం లు చేసే ప్రచారంతో మేము పోటీ పడలేమని.. ప్రజలను భ్రమల్లో పెట్టి వాళ్ళ వర్గం మాత్రమే బాగుపడాలని చూస్తారన్నారు.ప్రజలు ఏదీ ఆలోచించరు…ప్రతి చోట చంద్రబాబును నిలదీయాలని కోరారు. అధికారం ఇచ్చినప్పుడు ఏం చేశావ్ అని అడగాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ స్కాం…రియల్ ఎస్టేట్ స్కాం… అమరావతి అని ఆరోపణలు చేశారు. 175 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పగలిగే దమ్ము చంద్రబాబు కు లేదని.. తన ప్రభుత్వంలో ఏం చేశాడో చెప్పుకునే ధైర్యం లేదన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి.