పిఠాపురం నుంచి తప్పుకోనున్న పవన్ కళ్యాణ్ ? ఏంటీ టైటిల్ ఇలా ఉందని అనుకుంటున్నారా ? అయితే.. పవన్ కళ్యాణ్ ను విమర్శించే క్రమంలో వైసీపీ ఇదే విషయాన్ని తెరపైకి తీసుకొస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను టార్గెంట్ చేసి..ఈ అంశాన్ని తీసుకొచ్చారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.
వివరాల్లోకి వెళితే.. కూటమి పార్టీల్లో తన వాళ్లకే చంద్రబాబు టికెట్లు కేటాయిస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పిఠాపురంలో పవన్ ను తప్పించి SVSN వర్మను బరిలోకి దింపుతారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. చివరికి జనసేనకు 10 టికెట్లు మాత్రమే పరిమితం చేస్తారన్నారు. చంద్రబాబు కోసమే విపక్ష కూటమి ఏర్పడిందన్నారు. CBN… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అధికారంలోకి నెట్టారని…. గతంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని దుయ్యబట్టారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.