ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా యార్లగడ్డ వైసీపీకి గుడ్ బై చెప్పే విధంగా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. యార్లగడ్డకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ ఆశావహుల సంఖ్య పెరుగుతోంది అన్నారు. ముఖ్యంగా యార్లగడ్డ వైసీపీ తరపు నుండి పోటీ చేశారు. పార్టీ కోసం పని చేయాలి తమకు అవకాశం వచ్చే వరకు ఎదురు చూడాలని సూచించారు.
కానీ ఒక పదవి కోసం 50, 100 పోటీ చేసే పరిస్థితి ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది.తనకు ఇబ్బంది ఉంటే వెంకట్రావ్ మిమ్మల్ని కలిసి ఉండాల్సింది. ఇటువంటి అంశాల పై పార్టీలో అంతర్గతంగా చర్చించాలి. బహిరంగంగా ప్రకటనలు చేయాల్సిన అవసరం లేదు. మేము అందరం అందుబాటులో ఉండే నాయకులమే అని.. బహిరంగ ప్రకటనలు చేయటం కరెక్ట్ కాదు అని చెప్పారు సజ్జల. ముందుగా ఓ నిర్ణయం తీసుకొనే ఇప్పుడు ఈ ప్రకటనలు చేశారు అనిపిస్తోంది. పోతే పో అని నేనట్లు మీడియా వక్రీకరించి రాసింది. అలా నేనెందుకు అంటాను? నేనే కాదు మా పార్టీలో ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నాయకులంటే ఇంట్లో పని చేసే వారా అలా అనటానికి అని ప్రశ్నించారు సజ్జల.