విజయసాయికి జగన్ మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న సీఎం జగన్… సోషల్ మీడియాను పటిష్టం చేయటం పై ఫోకస్ పెట్టారు. సోషల్ మీడియా బాధ్యతలు చూడటానికి తెర మీదకు కొత్త పేరు తీసుకువచ్చారు. విజయసాయి స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ రెడ్డికి సోషల్ మీడియా బాధ్యతలు ఇచ్చారు జగన్.
ముఖ్యమంత్రి నేతృత్వంలో రెండు గంటల సేపు భేటీ అయిన భార్గవ్, సోషల్ మీడియా వింగ్ నేతలు సమావేశం అయ్యారు. ఇన్ని రోజులుగా సోషల్ మీడియాతో సహా పార్టీ అనుబంధ విభాగాల బాధ్యత విజయసాయిరెడ్డి చూస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాల దాడి, ఆరోపణలు పెరుగుతున్న నేపథ్యంలో కౌంటర్ స్ట్రాటజీ టీం అవసరం అని భావిస్తున్న సీఎం జగన్.. మీడియా, సోషల్ మీడియా బాధ్యతలు ఒకరి వద్ద ఉంటేనే సమన్వయంగా స్పందించటానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవరెడ్డికి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు.