ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు మరియు కళాశాలలు మూతపడనున్నాయి. విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వ తీర్పు నిరసనగా ఇవాళ స్కూల్స్ మరియు కాలేజీలు బంద్ చేపడుతున్నట్లు తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య, aisf వెల్లడించాయి.
విద్యా దీవన మరియు వసతి దీవన డబ్బులు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలో ఖాళీగా ఉన్న 53000 టీచర్ల పోస్టులను భర్తీ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి ఈ సంస్థలు. అలాగే కార్పొరేట్ విద్యా సంస్థలలో అధిక ఫీజులను నియంత్రించాలని కోరుతున్నాయి.