ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇవాళ ఏపీలో స్కూల్ బంద్ కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ తుఫాను నేపథ్యంలో స్కూళ్లకు ఇవాళ సెలవు ప్రకటిస్తూ ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
నెల్లూరు నుంచి కాకినాడ వరకు ఉన్న కోస్తా జిల్లాలలో తుఫాను ప్రభావం అధికంగా ఉన్నందున ఆయా జిల్లాలలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని విద్యాశాఖ కమిషనర్ సురేష్ ఆదేశాలు జారీ చేశారు. మిగతా జిల్లాలలో తీవ్రతను బట్టి కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని సూచనలు చేశారు. ఇక ప్రకాశం జిల్లాలో ఇవాళ మరియు రేపు కూడా స్కూల్లు బంద్ కానున్నాయి.
ఇది ఇలా ఉండగా.. ఈ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అటు తుఫాను నేపథ్యంలో ఏపీ ప్రజలు అలర్ట్ గా ఉండాలని సీఎం జగన్ కూడా అధికారులను అలర్ట్ చేశారు.