ఏపీ విద్యార్థులకు బిగ్ అలర్ట్..ఇవాళ స్కూల్స్ బంద్ కానున్నాయి. మిచౌంగ్ తుఫాను కారణంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్కూళ్లకు ఇవాళ కూడా సెలవు ఉండనుంది. కృష్ణ, ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం, వైయస్సార్, అన్నమయ్య జిల్లాల్లో విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. తుఫాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
ఇక రేపు రాయలసీమల, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాలు నమోదైయ్యే అవకాశం ఉన్నట్లు డా. బి.ఆర్ అంబేద్కర్ , మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల సంస్థ హెచ్చరించింది. ఈ తరుణంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.
కాగా,మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తిరుపతి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదుల్లోకి వరదనీరు పోటెత్తుతోంది. స్వర్ణముఖి నదిలోకి భారీగా వరద పోటెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాకాడులో స్వర్ణముఖి బ్యారేజీ వద్ద నీటి మట్టం పెరగడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.