కాసేపట్లో రెండో రోజు వైసీపీ ప్లీనరీ..ఈ అంశాలపై తీర్మానం

-

YSRCP ప్లీనరీ రెండవ రోజు 9.45 గంటలకు ప్రారంభం కానుంది. వరుసగా వర్షాలు పడుతుండటంతో తడిసి ముద్దైంది ప్లీనరీ ప్రాంగణం. ఇవ్వాళ మూడు లక్షల మందికి పైగా హాజరవుతారని పార్టీ వర్గాల అంచనా వేస్తున్నారు. మొదటగా పరిపాలనా- పారదర్శకత అంశం పై ప్లీనరీలో చర్చ జరుగనుంది. ఈ అంశంపై మాట్లాడనున్న తొలి వక్తగా స్పీకర్ తమ్మినేని సీతారాం, మాట్లాడనున్న ఎమ్మెల్యేలు బాలినేని, పుష్ప శ్రీవాణి, పార్థసారథి, తీర్మానం ప్రవేశపెట్టనున్నారు డొక్కా మాణిక్య వరప్రసాద్.

సామాజిక సాధికారత అంశంపై అత్యధికంగా 9 మందికి మాట్లాడే అవకాశం ఉంది. సామాజిక సాధికారత అంశం పై మాట్లాడనున్న మంత్రులు తానేటి వనిత, మేరుగ నాగార్జున, చెల్లుబోయిన వేణు, కార్మూరి నాగేశ్వరరావు, ఎంపీలు ఆర్.కృష్ణయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, సోషల్ జస్టిస్ అడ్వైజర్ జూపూడి, తీర్మానం ప్రవేశపెట్టనున్నారు నాగులపల్లి ధనలక్ష్మి.

వ్యవసాయం పై తీర్మానం మాట్లాడనున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యేలు కన్నబాబు, కరణం ధర్మశ్రీ, విశ్వేశ్వర రెడ్డి, తీర్మానం ప్రవేశపెట్టనున్నారు అగ్రికల్చర్ మిషన్ నాగిరెడ్డి. పరిశ్రమలు- ఎంఎస్ఎంఈ ల పై తీర్మానం పై స్పీకర్స్ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు. ప్లీనరీలో చివరి అంశంగా పచ్చ మీడియా- దుష్ట చతుష్టయం చర్చ జరుగనుంది.ఈ అంశం పై మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని, సినీ నటుడు పోసాని కృష్ణ మురళిమాట్లాడనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version