వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన కిల్లి వెంకట సత్యనారాయణ ఏర్పాటుచేసిన అభినందన సభలో మాజీ మంత్రులు ధర్మాన కృష్ణ దాస్, సీదిరి అప్పలరాజు, వివిధ నియోజకవర్గాల ఇన్చార్జులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే ఈ సభలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కీలక కామెంట్స్ చేసారు. వైసిపి హాయాంలో సామాజిక న్యాయం చేస్తూ పదవులు కేటాయించాం. నేడు కుటమి ప్రభుత్వం ప్రధాన సామాజిక వర్గాలను విస్మరించింది.
కేవలం ఇక కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చారు. రాజ్యసభ పదవులు అమ్ముకున్నారు అని ఆరోపించారు. అలాగే సానా సతీష్ లాంటి క్రిమినల్స్ కు పదవులు కట్టబెట్టరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంఘటితంగా ప్రజలు తరపున పోరాడాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేద్దాం. 13వ తేదీన రైతు సమస్యలపై ర్యాలీ చేసి జిల్లా కలెక్టర్ అందజేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని అన్నారు సీదిరి అప్పలరాజు.