ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై నటి శ్రియ ప్రశంసలు కురిపించారు. ఆయన అద్భుతాలు సృష్టించారంటూ కితాబిచ్చారు. హైదరాబాద్లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్లో పాల్గొన్న ఆమె తన కో స్టార్ పవర్ స్టార్ను ప్రశంసించారు. ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ విజయం పట్ల ఎంతో గర్వంగా ఉందని శ్రియ అన్నారు. తామిద్దరం గతంలో బాలు చిత్రం కోసం పని చేశామని గుర్తు చేసుకున్నారు.
ఆయన సెట్లో చాలా సైలెంట్గా ఉంటారని.. శ్రమపడే మనస్తత్వం ఉన్న మనిషి అని కొనియాడారు. బాలు మూవీ షూటింగ్ సమయంలో ఓ సాంగ్ షూట్ చేసేటప్పుడు ఆయన కాలికి గాయమైందని.. అయితే ఆ షూట్ పూర్తయ్యే వరకు ఆ విషయాన్ని ఎవరితో చెప్పలేదని అన్నారు. ప్రజలకు మంచి చేయాలని ఎప్పుడూ తాపత్రయపడేవారని తెలిపారు. అలాంటి మంచి మనిషిని ప్రజలు ఎన్నుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. ఆయన అద్భుతాలు సృష్టిస్తారని తాను బలంగా నమ్ముతున్నానని వెల్లడించారు. ఇక చిరంజీవి గురించి మాట్లాడుతూ.. తాను మెగాస్టార్తో కలిసి మరోసారి నటించాలని అనుకుంటున్నట్లు తెలిపారు.