Vande Bharat Express going to Secunderabad and Visakha has been cancelled: విజయవాడ రైల్వేస్టేషన్ వెలవెలబోతోంది. సికింద్రాబాదు, విశాఖ వెళ్ళే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ లు రద్దు అయ్యాయి. సౌత్ సెంట్రల్ రైల్వే లో దాదాపు 544 రైళ్ళు రద్దు అయ్యాయి. విజయవాడ నుంచీ 20 రైళ్ళు రద్దు కావడం జరిగింది.

తమ గమ్య స్ధానాలకు రైళ్ళు లేక ఎదురుచూస్తూ ఉన్నారు దూర ప్రయాణికులు. బస్సులలో వెళ్ళే దారి లేని ప్రయణికులు రైల్వే స్టేషను కే పరిమితం అయ్యారు. అలాగే తెలుగు రాష్ట్రాలలో ఇవ్వాళ.. రేపు.. నడపవలసిన మరో 20 రైళ్ళను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది దక్షిణ మధ్య రైల్వే. దీంతో ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో 544 ట్రైన్ లను భారీ వర్షాల కారణంగా రద్దు అయినట్లు తెలిపింది దక్షిణ మధ్య రైల్వే.