సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం ప్రమాద ఘటన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వనున్నారు. దీనిపై మంత్రులు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు.

మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు, గాయపడిన వారికి రూ.3లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు. బాధిత కుటుంబసభ్యులకు దేవాదాయశాఖలో ఔటసోర్సింగ్ ఉద్యోగ అవకాశం.ఉన్నట్లు సమాచారం అందుతోంది. శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడం నన్ను కలచి వేసిందన్నారు సీఎం చంద్రబాబు. భారీ వర్షాల కారణంగా గోడ కూలడం తో జరిగిన ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.