సింహాచలం ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. సింహాచలం ఘటన దురదృష్టకరం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నా అని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

ఇక అటు సింహాచలంలో గోడకూలి భక్తులు మృతిచెందడంపై YS జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రూ.300 టికెట్ క్యూ లైన్ పై గోడకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్ర విచారం చేశారు YS జగన్. నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు YS జగన్.