బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీ ఎంపీలు అవినాష్ రెడ్డి, మిధున్ రెడ్డి బిజెపిలో చేరుతున్నారన్న ప్రతిపాదన గాని ఆలోచన గాని లేదని క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో… మున్సిపల్ చైర్మన్ టిడిపిలో చేరినట్లు తెలిసింది.. ఒకరు ఈ పార్టీలో చేరాలి మరో పార్టీలో చేరకూడదు అనే నిబంధన ఏదీ లేదని వెల్లడించారు.
ఎవరు ఏ పార్టీలోనైనా చేరవచ్చని… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షం కావాలి, ప్రజాపక్షంగా కూడా వ్యవహరించవచ్చు తెలిపారు. కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీలో అహంకార ధరణి మారట్లేదు… ఎమర్జెన్సీ కాలం నుండి కాంగ్రెస్ పార్టీ ఇదే తీరు అంటూ ఫైర్ అయ్యారు. ప్రస్తుత పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ ఇదే ధోరణితో వ్యవహరిస్తుంది… ఏవీఎంలపై అనుమానాలు ఉన్నాయని వైసిపి నేతలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు గౌరవించాలి..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమీ ప్రభుత్వం కూడా. హుందతనంగా వ్యవహరించాలని కోరారు. మెడికల్ కాలేజీలు నిర్మాణానికి కేంద్ర సహాయం కోరాలి… కేంద్ర ప్రభుత్వం లక్ష చేపట్టిన కారిడార్ అంటూ పేర్కొన్నారు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు.