తిరుపతి, తిరుమల అత్యంత సేఫ్ గా ఉన్నాయి. తిరుపతి నగరవాసులకు.. శ్రీవారి భక్తులకు ఎలాంటి భయాలు అవసరం లేదు అని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అన్నారు. బాంబు బెదిరింపులపై ప్రత్యేక సైబర్ టీం, ఐటి, సహా ఇతర విభాగాలతో దర్యాప్తును వేగంగా చేస్తున్నాం. ఇంటెలిజెన్స్ బ్యూరోతో పాటు ఎన్ఐఏ కూడా ఈ మెయిల్స్ పై దర్యాప్తు చేస్తోంది. అలాగే తిరుమల, తిరుపతిలో భద్రత పెంచాం. నగరవాసులకు ఏదైనా చిన్న అనుమానాస్పద వస్తువులు కనపడ్డ.. అనుమానాస్పద వ్యక్తులు తారసపడ్డ పోలీసులకు సమాచారం ఇవ్వండి అని సూచించారు.
సిటీ మొత్తం నిరంతరం సీసీటీవీ పర్యవేక్షణలో ప్రతి ఒక్కరి కదలికను మానిటరింగ్ చేస్తున్నాం. బెదిరింపులు వచ్చిన అన్ని హోటల్లో సహా ఇతర ప్రదేశాలలో పూర్తిస్థాయి తనిఖీలు చేపట్టాం. బెదిరింపు ఈమెయిల్స్ పై ఇప్పటికే కేసులు నమోదు చేశాము. ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు తనిఖీల్లో దొరకలేదు. వస్తున్న మెయిల్స్ పై కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థ సహకారంతో దర్యాప్తు వేగవంతం చేస్తున్నాం అని ఎస్పీ సుబ్బారాయుడు పేర్కొన్నారు.