శ్రీకాకుళంలో దారుణం.. కరోనాతో చనిపోతే చెప్పకుండానే ఖననం !

శ్రీకాకుళం రిమ్స్ కోవిడ్ ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం మరో సారి బయట పడింది. ఈ నెల 18న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కరోనాతో శంకర్ అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే అసలు ఆయన చనిపోయిన విషయాన్ని కుటుంబసభ్యులకు సమాచారమివ్వకుండానే ఖననం చేశారు ఆస్పత్రి సిబ్బంది. అయితే తమ కుటుంబ సభ్యుడు శంకర్ కోసం రిమ్స్‌కు వచ్చిన కుటుంబసభ్యులకు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు ఆస్పత్రి సిబ్బంది.

ఆ ఏంటి కరోనాతో చనిపోతే ఖననం చేసేశామని చెప్పారు. దీంతో సిబ్బంది తీరు పై కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇక ఏపీలో కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. 24 గంటల్లో కొత్తగా 7,553 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్యా రోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 639302కు పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలో మరో 51 మంది చనిపోవడంతో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 5461కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 71465 యాక్టివ్‌ కరోనా కేసులున్నాయి.