ఏపీలో ఆయనే అనధికారిక ముఖ్యమంత్రా…?

రాష్ట్రం ఆర్థిక ఉగ్రవాది చేతచిక్క దివాళా దిశగా సాగుతోందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ప్రభుత్వం తెచ్చిన లక్షా 27వేలకోట్ల అప్పలు పేలపిండిలా గాలిపాలయ్యాయని ఆయన ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక మాఫియాలో మునిగితేలుతూ, కోట్లకు పడగలెత్తుతున్నారని మండిపడ్డారు. ఇళ్లస్థలాలపేరుతో రూ.4వేలకోట్లు కాజేసినా, సీబీఐ విచారణ జరిపించమంటే సీఎం నోరు మెదపడంలేదన్నారు.

ఏడీబీ నిధులు కాజేయడానికి మంత్రే ప్రయత్నించారని ఆయన మండిపడ్డారు. మీడియా ద్వారా వ్యవహారం బయటకు రావడంతో టెండర్లు రద్దుచేశారని విమర్శించారు. హిందూమతంపై దాడిచేస్తూ, ఆలయభూములను ఇళ్లస్థలాలపేరుతో లాక్కొంటున్నారని ఆరోపణలు చేసారు. అనధికార ముఖ్యమంత్రి సజ్జల కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. మాటతప్పను, మడమ తిప్పను అనిచెప్పిన వ్యక్తి, నేడు టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు ప్రలోభపెట్టి, భయపెట్టి తన పార్టీలోకి చేర్చుకుంటున్నాడని అన్నారు. వారితో రాజీనామా చేయించి తనపార్టీ తరపున గెలిపించుకునే ధైర్యంలేకనే ఇలా చేస్తున్నారని విమర్శించారు.