శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి షాకింగ్ కామెట్స్ చేశారు. దేవుడి సాక్షిగా చెబుతున్న రాయుడు హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సుధీర్ రెడ్డి. ఈ సందర్బంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడారు.
తిరుమల స్వామి సన్నిధిలో ఉండి చెబుతున్నా రాయుడు హత్య, వినుత విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే. రాజకీయ కోణంలో తనపై వైసీపీ తీవ్ర అభాండాలు వేస్తోందన్న బొజ్జల సుధీర్ రెడ్డి… రాయుడు హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
కాగా టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ పై కోట వినూత దంపతులు సంచలన ఆరోపణలు చేశారు. రాయుడిని హత్య చేసింది టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ అంటూ బాంబు పేల్చారు కోట వినూత దంపతులు. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయి అన్నారు కోట వినుత దంపతులు.