ఏపీ, తెలంగాణకు చల్లటి కబురు.. నేడు రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నేడు ఏపీలోని రాయలసీమ, తిరుపతి జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలియజేసింది. ఉత్తరాంధ్రలో మోస్తారు వర్షాలు, కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు సూచనలు జారీ చేశారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు, ఎల్లుండి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.