తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాన్ని పురస్కరించుకొని ఈ నెల 19న కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టీటీడీ 19న బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. 18న సిఫారసు లేఖలు స్వీకరించడం లేదని వెల్లడించింది.
కాగా, గడిచిన 24 గంట్లో తిరుమల శ్రీవారి దర్శనం కోసం 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. ఇక ఈ తరుణంలోనే.. టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 06 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 71, 037 మంది భక్తులు దర్శించుకున్నారు. కాగా.. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారికి 25635 మంది భక్తులు….తలనీలాలు సమర్పించారు. గడిచిన 24 గంట్లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.89 కోట్లుగా నమోదు అయింది.