విశాఖ ఇంతలోనే పాపాత్మురాలైపోయిందంట!

-

ఏమాటకామాట చెప్పుకోవాలంటే… ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, విశాఖను ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా మారుస్తూ ప్రకటన వెలువరించిన నాటి నుంచీ.. ఒక వర్గం మీడియాకు వైజాగ్ అనేది ఒక నరకంలా, పాతాళంగా కనిపిస్తుందనే చెప్పాలి! ఈ విషయంలో సరైన అదను కోసం చూశారు వారంతా! అమరావతి మాత్రమే గొప్పదని ఇంతకాలం చెప్పుకుంటూ వచ్చిన ఆ వర్గం మీడియాకు తాజాగా విశాఖలో జరిగిన గ్యాస్ లీకేజీ సంఘటనతో.. ఎక్కడలేని ఉత్సాహం తన్నుకొచ్చింది! ఇంతకాలం అమరావతి గొప్పది అని మాత్రమే సమర్ధించుకున్న ఆ వర్గం… ఇప్పుడు విశాఖ చెడ్డది, ప్రమాదకరమైంది, ఏమాత్రం సెఫ్ కాదు అనేస్థాయికి తెగించేసింది! విశాఖను, విశాఖ వాసులను ఏ దేవుకు రక్షిస్తాడో చూడాలి అనేస్థాయికి వారి వ్యాసాలు దిగజారిపోయాయి!

వివరాళ్లోకి వెళ్తే… కరోనా వల్ల కాస్త తగ్గింది కానీ… విశాఖ అనేది ఒక టూరిస్ట్ హాట్ డెస్టినేషన్.. ఇదే క్రమంలో ఇటీవలి కాలంలో పారిశ్రామికంగానూ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.. లెక్కలేనన్ని పరిశ్రమలు వచ్చి చేరాయి.. సముద్ర తీరం, ఓడరేవు… ఇలా ఎన్నో ప్లస్ లు ఉన్న విశాఖ గురించి… తాజా ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విష వాయువు లీకైన కారణాన్ని చూపిస్తూ… విశాఖ మరింత డేంజర్ నగరంగా మారిపోయిందనే చెప్పాలి అని కథనాలు వండి వడ్డించేస్తుంది ఒక వర్గం మీడియా! పరిశ్రమలన్నీ విశాఖ విస్తరించడంతో… ఊరిలోకే వచ్చేసాయనేది వారి అభియోగం. కాసేపు ఆ విషయమే నిజమనుకుంటే… అప్పుడు పరిశ్రమలను మరింత చివరికి తరలించే కార్యక్రమాలు చేపట్టాలి కానీ… విశాఖ అభివృద్ధిని ఆపేయాలి అనికోరుకుంటున్నట్లుగా స్పందించడం, అక్కడి జనాలను మరింత భయబ్రాంతులకు గురిచేయడం ఏమంత సమంజసం!?

ఉదాహరణకు హైదారాద్ లోని మోతీనగర్ (బోరబండ) ప్రాంతంలోని గ్లాస్ ఫ్యాక్టరీ… ఒకప్పుడు ఊరికి అత్యంత వెలుపల ఉంది. ఇప్పుడు హైటెక్ సిటీకి 2 కిలోమీటర్ల లోపే ఉంది! గూగుల్, ఫేస్ బుక్ ఆఫీసులకు.. అత్యంత రద్దీ అయిన అమీర్ పేటకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది! అంటే… ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ఒకవైపులో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నట్లే! అది ఫ్యాక్టరీ తప్పు అందామా లేక జనాల తప్పు అందామా లేక రాజధాని విస్తరించడం ప్రభుత్వం తప్పు అందామా? కాలక్రమేణా, పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఇవన్నీ అత్యంత సహజమైన విషయాలు! ఒకప్పుడు కాకులు దూరని కారవుడులు, చీమలు దూరని చిట్టడవులు అనుకున్న భూములన్నీ కోట్లకు చేరిపోలేదా? అదేకదా అభివృద్ధి అంటే! ఈ విషయాలను గమనించన ఆ మీడియా మాత్రం… విశాఖలో జనావాసాల్లోకి ఫ్యాక్టరీలు వచ్చి చేరిపోయాయి… కాబట్టి విశాఖ అనేది ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ఏమాత్రం పనికి రాదు.. విశాఖను, విశాఖ వాసులను దేవుడే కాపాడాలి అని కథనాలు ఇవ్వడం ఎంతవరకూ సమంజసం?

సాగర నగరంగా, పర్యాటకానికి పుట్టిల్లులా కనిపించేది విశాఖ నగరం. ఓ వైపు కనుచూపు మేర సముద్ర తీరం.. మిగిలిన మూడు వైపులా దట్టమైన కొండలు కలిగిన విశాఖ… నిజంగానే పర్యాటకానికి పెట్టింది పేరే. ఒక్క తుఫాన్లు మినహా మిగిలిన ఏ ప్రకృతి వైపరీత్యమూ ఈ నగరాన్ని తాకే అవకాశాలే లేవు! మొత్తంగా ప్రకృతి అందాలతో అలరారే విశాఖ సుఖమయ జీవనానికి కేరాఫ్ అడ్రెస్! అందుకే వివిధ రంగాలకు చెందిన చాలా మంది ప్రముఖులు విశాఖనే తమ హోం సిటీగా ఎంచుకోవడానికి ఇష్టపపడేవారు.. ఇష్టపడుతున్నారు కూడా! అలాంటి విశాఖ చేసిన నేరమేమిటి? జగన్ దృష్టిలో పడటమా? జగన్ ఆ ప్రాంతాన్ని ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రకటించి, దాన్ని మరింత అభివృద్ధి చేయాలనుకోవడమా? గ్యాస్ లీకేజీ విషయంలో జరిగింది దారుణ సంఘటనే… కాదనేవారు లేరు! కానీ దాన్ని సాకుగా చూపి.. విశాఖ అభివృద్ధిని అడ్డుకోవాలని, విశాఖ ప్రజలను భయబ్రాంతులకు గురిచేయాలని ఆలోచించడం, విశాఖ ఉన్నట్లుండి ఈ ఒక్క సంఘటనతో పాపాత్మురాలైపోయినట్లు మాట్లాడటం మాత్రం క్షమించరాని నేరం!!

Read more RELATED
Recommended to you

Latest news