తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. స్కూళ్లకు ఎల్లుండి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. క్లాసులు, ట్యూషన్లు, పరీక్షలతో ఏడాది పాటు కుస్తీ పట్టిన విద్యార్థులు 48 రోజులపాటు సమ్మర్ సెలవుల్లో ఉపశమనం పొందనున్నారు.
సెలవుల అనంతరం విద్యార్థులకు జూన్ 12న స్కూళ్లు తెరుచుకొనుండగా జూన్ తొలివారం నుంచి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. సెలవుల్లో మన ఊరు – మనబడి, మన బస్తి కార్యక్రమాలను పూర్తి చేయాలని యోచిస్తోంది. ఇది ఇలా ఉండగా, విశాఖ జిల్లాలోని సింహాచలం అప్పన్న ఆలయం భక్తజనసంద్రంగా మారింది. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దివ్య రూపాన్ని భక్తులు దర్శించుకుని తరిస్తున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు స్వామి వారి తొలి దర్శనం చేసుకున్నారు. ప్రభుత్వం TTD తరపున మంత్రి కొట్టు సత్యనారాయణ, వైవి సుబ్బారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పిస్తున్నారు.