మునుగోడు ఉపఎన్నిక సమయంలో BRS నుంచి రేవంత్ రెడ్డి రూ.25 కోట్లు తీసుకున్నట్లు ఈటల రాజేందర్ చేసిన వాక్యాలపై యూత్ కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈటల వెంటనే తన ఆరోపణలను వెనక్కు తీసుకొని క్షమాపణలు చేయాలని, ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఈటల దిష్టిబొమ్మ దహనానికి పిలుపునిచ్చింది.
ఆధారాలు లేని ఈటల ఆరోపణలతో రేవంత్ కళ్ళలో నీళ్ళు చూసామని… రాజేందర్ క్షమాపణ చెప్పేంతవరకు ఆయన వెంట పడతామని హెచ్చరించింది.