చంద్రబాబును అప్పటివరకు అరెస్ట్ చేయవద్దు : సుప్రీం

-

చంద్రబాబును అప్పటివరకు అరెస్ట్ చేయవద్దని సుప్రీం కోర్టు పేర్కొంది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. నవంబర్ 9కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ ఎం. త్రివేదితో కూడిన ధర్మాసనం తెలిపింది. అప్పటివరకు పిటి వారెంట్ పై యధాతధా స్థితి కొనసాగించాలన్న సుప్రీం… చంద్రబాబును అరెస్టు చేయొద్దని పేర్కొంది.

స్కిల్ కేసు తీర్పు ముందుగానే ఇస్తామని… అనంతరం ఫైబర్ నెట్ అంశం పరిగణలోకి తీసుకుంటామని చెప్పింది. ఇది ఇలా ఉండగా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబుకు విజయవాడ ఏసిబి కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు లీగల్ ములాఖత్ ల పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. లీగల్ ములాఖత్ ల సంఖ్యను మూడుకు పెంచాలని చంద్రబాబు లాయర్లు నిన్న పిటిషన్ వేయగా…. ప్రతివాదుల పేర్లు చేర్చకపోవడంతో న్యాయస్థానం కొట్టేసింది. దీంతో రోజుకు ఒకసారి మాత్రమే చంద్రబాబుతో లాయర్లకు మూలాఖత్ ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Latest news