పోలవరంపై సుప్రీంకోర్టులో కేంద్రానికి చుక్కెదురు

-

పోలవరం ప్రాజెక్టు వ్యయం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది.ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వాదనలు సంబంధిత రాష్ట్ర హైకోర్టులోనే వినిపించాలని సూచించింది. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందున దాని నిర్మాణ వ్యయం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలంటూ మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌ను దిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం 2019లో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్థీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం రోజున విచారణ చేపట్టింది.

ఈ పిటిషన్‌ను దిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనానికి విన్నవించగా.. పోలవరంపై ఇతర పిటిషన్లు ఏపీ హైకోర్టులో ఉన్నాయని కేవీపీ తరఫు న్యాయవాది చెప్పారు. ఏపీ హైకోర్టులో ఇందుకు సంబంధించిన ఇతర పిటిషన్లు ఉన్నప్పుడు ఈ వ్యాజ్యం దిల్లీ హైకోర్టులో ఎందుకు అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ రాష్ట్ర హైకోర్టులోనే వాదనలు వినిపించుకోవాలని సూచిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.

Read more RELATED
Recommended to you

Latest news