ఏపీలోని విద్యార్థులకు శుభవార్త చెప్పారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. పాఠశాలలోని విద్యార్థులు 8 వ తరగతి లోకి అడుగు పెట్టగానే.. అందరికీ ట్యాబ్ లు అందజేస్తామని ప్రకటించారు సీఎం జగన్. 8 వ తరగతి లోకి అడుగు పెట్టే విద్యార్థులకు ఉచితంగానే రూ.12 వేలు విలువ చేసే ట్యాబ్ లు అందిస్తామని చెప్పారు.
43 లక్షలా 96 వేలమంది తల్లులకు, రూ. 6595 కోట్లు నేరుగా ఖాతాలలోకి వేశారు ముఖ్యమంత్రి జగన్ మోహాన్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మీ కుటుంబాల భవిష్యత్ ను పిల్లల చదువులలో చూసుకుంటున్న తల్లులకు , పిల్లలకు బెస్డ్ విసెస్ చెబుతున్నానని పేర్కొన్నారు.
కుటుంబం, దేశం తలరాతలు మార్చగలిగేది ఒక్క చదువేనని.. చదువులు ఎక్కువ ఉన్న దేశాలలో ఆదాయాలు ఎక్కువ అన్నారు. తలసరి ఆదాయం ఎక్కువ ఉండటానికి కారణం చదువు అని.. చదువే నిజమైన అస్తి. చదువుపై ఖర్చు చేసే ప్రతి పైసా పవిత్రమైన పెట్టుబడి, ఒకతరాన్ని , తలరాతలను మార్చే శక్తి విద్యకే ఉందని వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడికైనా వెల్లి బ్రతికే సత్తా , చదువుతోనే వస్తుందని.. దేశంలో అన్ని రాష్ర్టాల కంటే మిన్నగా మన పిల్లల చదువులు ఒక హక్కుగా అందాలని ముందుకు వెలుతున్నామని పేర్కొన్నారు.