ఏపీ ప్రజలకు సీఎం జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇవాళ వైయస్సార్ కళ్యాణమస్తు, వైయస్సార్ షాది తోఫా పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయనున్నారు. చదువులకు మరింత ఊతమిస్తూ వైయస్సార్ కళ్యాణమస్తు మరియు వైయస్సార్ షాది తోఫా ఆర్థిక సహాయాన్ని సీఎం జగన్ ఇవాళ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయనున్నారు.

ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబర్ త్రేమాశికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10511 జంటలకు ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఖజానా నుంచి… 81 కోట్ల ఆర్థిక సహాయాన్ని చేయనున్నారు సీఎం జగన్. క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాలలో జమ చేస్తారు. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి… వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించడానికి అండగా నిలుస్తూ… ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలలోని ఆడపిల్లలకు వైయస్సార్ కళ్యాణమస్తు ద్వారా… మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైయస్సార్ షాదీ తోఫా ద్వారా ఆర్థిక సాయం చేస్తోంది జగన్ సర్కార్. అందులో భాగంగానే ఇవాళ కూడా ఈ డబ్బులను రిలీజ్ చేయనుంది.