బాబుగారి తెలివి తేట‌లపై.. త‌మిళ మీడియా మామూలుగా ఏక‌లేదు..!

-

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు తెలివి తేట‌లు తెలుగు వారికి తెలిసిందే..! ముందు కాద‌ని, త‌ర్వాత కావాల‌ని అన‌డంలో ఆయ‌న‌కు సాటి మ‌రొక‌రు లేరు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఆయ‌న ఇలానే చేశారు. ముందు వ‌ద్ద‌న్నారు. దాంతో ఏం వ‌స్తుందో చెప్పాల‌న్నారు. హోదా అన్న‌వారిని బొక్క‌లోకి తోసారు. త‌ప్పుడు కేసులు పెట్టారు. ఎన్నికల స‌మాయానికి వ‌చ్చే స‌రికి కుయ్యో మొర్రో అంటూ.. హోదా కోసం పాకులాడారు. ఇలా ఒక‌టా రెండా..? అనేక విష‌యాల్లో చంద్ర‌బాబు చేసిన ఫీట్లు, ఆయ‌న చూపించిన తెలివి తేట‌లు కూడా ప్ర‌జ‌ల‌కు, పార్టీ నేత‌ల‌కు కూడా న‌వ్వు తెప్పించాయి.

బీజేపీతో పొత్తు విష‌యంలోనూ బాబు ఇలానే వ్య‌వ‌హ‌రించారు. 2014లో బీజేపీతో పొత్తు అదృష్ట‌మ‌న్నారు. మోడీ ప్ర‌ధాని అయ్యే వ‌ర‌కు విశ్ర‌మించ‌బోన‌న్నారు. క‌ట్ చేస్తే.. నాలుగేళ్లు కూడా తిర‌గ‌కుండానే.. మోడీ నాకు అప్పాయింట్‌మెంటే ఇవ్వ‌డం లేద‌ని గ‌గ్గోలు పెట్టారు. మోడీ హ‌ఠావో నినాదం అందుకున్నారు. ఇదేంట్రా బాబూ.. అని త‌మ్ముళ్లు త‌ల‌లు ప‌ట్టుకున్నారు. స‌రే! ఈ విష‌యం ఇక్క‌డితో ఆగ‌డం లేదు. ప్ర‌స్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ కేంద్రంలోని న‌రేంద్ర‌మోడీతోను, బీజేపీతోనూ చాలా జాగ్ర‌త్త‌గా అడుగులు వేస్తోంది.

కేంద్ర కేబినెట్‌లో చేరే అవ‌కాశం ఉన్నా.. చేర‌కుండా డిస్టెన్స్ మెయింటెన్ చేస్తోంది. అదే స‌మ‌యంలో కేంద్రంతోనూ అంట‌కాగుతోంది. దీంతో టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు చిర్రెత్తుకొస్తోంది. ఈ ప‌రిణామాల‌పై టీడీపీ నాయ‌కులు కూడా నివ్వెర పోతున్నారు. మ‌న‌కెందుకు బాబూ.. అని ప్ర‌శ్నిస్తున్నార‌ట‌. బీజేపీతో స‌ఖ్య‌త‌తో ఉంటే.. మ‌నం మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేవాళ్లం. కానీ, మీరు వింటిరా? అంటూ దెప్పిపొడుపులు పొడుస్తున్నార‌ట‌. ఇదంతా ఏ వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌త్రిక‌లోనో.. చంద్ర‌బాబు అంటే గిట్ట‌ని మీడియాలోనో వ‌చ్చిన వార్త‌లు కావు.. !

బాబు గారి తెలివి తేట‌ల‌పై త‌మ్ముళ్లు ఏమ‌నుకుంటున్నారో.. పొరుగు రాష్ట్రం మ‌న‌కు పెద్ద‌గా సంబందం లేని రాష్ట్రం త‌మిళ‌నాడులోని మీడియా రాసుకొచ్చింది. తమిళ దినపత్రిక ‘దినమలర్‌’ శుక్రవారం ఒక కథనాన్ని ప్రచురించింది. ఇరుగూ పొరుగూ శీర్షిక కింద ‘ఏన్‌ ఇంద వయిట్రెరిచ్చల్‌’ (ఎందుకీ కడుపు మంట) పేరిట ప్రచురించిన ఆ కథనంలో బాబును ఏకేసింది. మొత్తానికి మ‌న బాబుగారి తెలివి తేట‌లు..త‌మిళ‌నాడు వ‌ర‌కు పాకాయ‌న్న‌మాట‌!! అని తెలుగు ప్ర‌జ‌లు చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Exit mobile version