ఏపీ హోం మంత్రిగా తానేటి వనిత..ఏ శాఖలు ఎవరి కంటే !

-

అమరావతి : ఏపీ కొత్త కేబినేట్‌ పేర్లు ఫైనల్‌ చేసిన సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి… మంత్రులకు శాఖల కేటాయింపుపై కసరత్తు చేస్తున్నారు. పాత మంత్రుల్లో కొందరికి పాత శాఖలు కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. గతంలో మాదిరిగానే ఎస్సీ మహిళకే హోం శాఖ అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ ఈక్వేషనులో తానేటి వనితకు హోం మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్ధిక శాఖ మంత్రిగా బుగ్గన రాజేంద్ర నాథ్‌ రెడ్డి కొనసాగనున్నారు. ధర్మాన ప్రసాదరావుకు రెవెన్యూతో పాటు మరో కీలక శాఖ అప్పగించే అవకాశం ఉంది. రోజాకు ఏ శాఖ కేటాయించనున్నారనే అంశంపై ఆసక్తి నెలకొంది. కాకానికి వ్యవసాయం.. లేదా మరో కీలక శాఖ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రుల శాఖల విషయంలో మధ్యాహ్నం లేదా సాయంత్రానికి క్లారిటి వచ్చే అవకాశం ఉంది.

గతంలో లానే ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కనున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. మైనారిటీ నుంచి అంజాద్ బాషా డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉండగా… ఎస్టీ వర్గం నుంచి పీడిక రాజన్న దొర కానున్నారు. ఎస్సీ నుంచి నారాయణ స్వామి లేదా పినెపి విశ్వరూప్ లేదా వనిత కానుండగా.. బీసీ నుంచి ధర్మాన ప్రసాదరావు లేదా బొత్సకు ఛాన్స్ ఉంది. కాపు సామాజిక వర్గం నుంచి అంబటి రాంబాబు లేదా దాడిశెట్టి రాజాకు అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version