శ్రీశైలం దర్శనానికి వెళ్లి వస్తున్న టాటా ఏస్ వాహనం ఆగివున్న లారీని ఢీ కొట్టిన ఘటనలో 9 మంది మృతి చెందినట్లు సమాచారం. డ్రైవర్ నిద్రమత్తు తొమ్మిది మంది ప్రాణాలను బలితీసుకుంది. పల్నాడు జిల్లా రెంటచింతల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆదివారం అర్ధరాత్రి ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెంటచింతల కు చెందిన 38 మంది టాటా ఏస్ వాహనంలో శ్రీశైలం వెళ్లి వస్తున్నారు.
మరికొద్ది సేపట్లో ఇంటికి చేరుకుంటారనగా రెంటచింతల విద్యుత్ సబ్స్టేషన్ వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.క్షతగాత్రులను గురజాల ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ సమీర్ భాషా సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. నిద్రమత్తులో ఉన్న టాటా ఏసీ డ్రైవర్ రోడ్డు మార్జిన్లో ఆగి ఉన్న లారీని గుర్తించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.