బ్రాహ్మణి పై అయ్యన్న వివాదస్పద వ్యాఖ్యలు..వీడియో వైరల్‌

-

నేడు ఏపీ హైకోర్టులో చంద్రబాబు, లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లు విచారణ విచారణకు రానున్నాయి. ఫైబర్ నెట్ స్కాం లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్, స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లు మీద విచారణ జరపనుంది ఏపీ హైకోర్టు. IRR కేసులో నేడు సీఐడీ విచారణకు రావాలన్న నోటీసులపై తన ఇంటి వద్దే విచారణ చేయాలని మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో నేడు విచారణకు రానుంది.

ayyanna-patrudu-comments nara bramhini
ayyanna-patrudu-comments nara bramhini

ఇది ఇలా ఉండగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు… బ్రాహ్మణి ఎవరనే విషయంలో టంగ్ స్లిప్ అయ్యారు. టంగ్ స్లిప్ అనేకంటే అలవాటైన పదప్రయోగాలు చేశారు అనడం బెటర్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.  దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా టిడిపి శ్రేణులు చేపడుతున్న “సత్యమేవ జయతే” కార్యక్రమంలో పాల్గొన్న అయ్యన్నపాత్రుడు… “బ్రాహ్మణి, బాలకృష్ణ రెండో కూతురు, లోకేష్ భార్య” అని సంబోధించారు.

దీంతో పక్కనున్నవారు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. బ్రాహ్మణి… బాలకృష్ణ పెద్ద కూతురు అని తెలిపారు. దీంతో….”అదే పెద్ద కూతురు… దాని పేరు ఏమి పేరు? అని అన్నారు. ఇలా టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్వయానా ఆ పార్టీ అధ్యక్షుడి కోడలు విషయంలో “దాని పేరు” అని సంబోధించిన విధానం చాలా దారుణంగా ఉందంటున్నారు. దీనిపై ఆర్జీవీ కూడా స్పందించారు.

Read more RELATED
Recommended to you

Latest news