మంగళగిరిలో ఏర్పాటు చేసిన ‘జయహో బీసీ ’ సభలో టీడీపీ – జనసేన బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బీసీ డిక్లరేషన్‌ను విడుదల చేశారు. బీసీల అభివృద్ధికి చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. బీసీల దశ.. దిశ మార్చడం కోసమే డిక్లరేషన్ ప్రకటించామని చంద్రబాబు అన్నారు. 40 ఏళ్లుగా తమ పార్టీ బీసీలకు అండగా ఉందని తెలిపారు.
డిక్లరేషన్‌లోని ముఖ్యాంశాలు ఇవే..
బీసీలకు 50 సంవత్సరాలకే పింఛను. నెలకు రూ.4వేలకు పెంపు. పెళ్లి కానుక రూ.లక్షకు పెంపు.
విద్యాపథకాలు అన్నీ పునరుద్ధరిస్తాం. షరతులు లేకుండా విదేశీ విద్య అమలు.
చట్టసభల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం.
అన్ని సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34శాతం రిజర్వేషన్.
జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్ల ఏర్పాటు. దామాషా ప్రకారం నిధుల కేటాయింపు.
సామాజిక న్యాయపరిశీలన కమిటీ ఏర్పాటు.
సబ్‌ప్లాన్ నిధులు బీసీలకే వినియోగించేలా చర్యలు.
స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10వేల కోట్లు.
చట్టబద్ధంగా కులగణన నిర్వహించి, శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాం.
గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్.
ఏడాదిలో బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం.