“నాలుగేళ్ల నరకం” కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం

-

ఏపీ రాజకీయాలు రోజురోజుకీ హీటెక్కుతున్నాయి. ఆధిపత్యం కోసం అధికార ప్రతిపక్షాలు కొత్త కొత్త స్ట్రాటజీలతో ముందుకు వెళుతున్నాయి. తాజాగా వైసీపీ నేతల అక్రమాలపై “నాలుగేళ్ల నరకం” పేరుతో టిడిపి సరికొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ఓ వీడియోని రిలీజ్ చేశారు.

రానున్న రోజులలో గల్లీ నుండి పట్టణాల వరకు ప్రజలకు జరిగిన అన్యాయాన్ని, వైసీపీ నాయకుల అక్రమాలను ఎత్తి చూపే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. జగన్ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలను, వైసిపి నేతల అక్రమాలను సమాజానికి తెలియజేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం అని అన్నారు చంద్రబాబు. దాదాపు నెల రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version