స్వదేశంలో జరుగుతున్న వన్ డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్ లో జింబాబ్వే అదరగొడుతోంది. మొన్నటికి మొన్న వెస్ట్ ఇండీస్ జట్టును అలవోకగా ఓడించిన జింబాబ్వే.. ఈ రోజు అమెరికాతో జరుగుతున్న మ్యాచ్ లో చెలరేగి ఆడింది, మొదట బ్యాటింగ్ చేపట్టిన జింబాబ్వే అమెరికా ముందు అసాధ్యమైన టార్గెట్ ను ఉంచింది. నిర్ణీత ఓవర్ లలో జింబాబ్వే జట్టు 6 వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది. జింబాబ్వే వన్ డే చరిత్రలోనే ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఈ స్కోర్ ను సాధించడంలో తలో ఒక చేయి వేశారు.. గుంబీ 78, రాజా 48, బుర్ల్ 47 పరుగులు చేస్తే… వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ విలియమ్స్ కేవలం 101 బంతుల్లోనే 174 పరుగులు చేశాడు.
సంచలనం: వన్ డే లలో అత్యధిక స్కోర్ చేసిన జింబాబ్వే…
-