ఓడినా కూడా కేటీఆర్‌ పొగరు తగ్గలేదు – సోమిరెడ్డి

-

ఏపీ మరో 5 ఏళ్లు నలిగిపోవాలని కేటీఆర్‌ చూశారు అంటూ ఏపీ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్‌ అయ్యారు. ఏపీలో జగన్‌ గెలవాల్సిందంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు సోమిరెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. గులాబీ పార్టీ పాలనలో తండ్రి ఫామ్ హౌస్ కు, కొడుకు కలెక్షన్ హౌస్ కు పరిమితమయ్యారని ఆగ్రహించారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కాళ్ల కింద పడేసి తొక్కినా, మీ సొంత చెల్లెలు కవిత జైలులో మగ్గుతున్నా మీలో అహంకారం తగ్గకపోవడం ఆశ్చర్యంగా ఉందని ఫైర్ అయ్యారు.

TDP MLA Somireddy Chandramohan Reddy And KTR

ఆ అహంకారాన్ని ఆత్మవిశ్వాసంగా భావించడంతో మీ కళ్లకున్న పొరలు ఇంకా తొలగనట్టుందని అంటూ కేటీఆర్‌ పై సీరియస్‌ అయ్యారు. ఆ పొగరుతోనే ఆంధ్రప్రదేశ్ నాశనమైపోవాలని కోరుకున్నారు. జగన్ లాంటి నియంత చేతిలో ఏపీ మరో ఐదేళ్లు నలిగిపోవాలని ఆశించారు. అందుకే మీకు తెలంగాణ ప్రజలు ముందుగానే గుణపాఠం చెప్పారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో జైలుకు పంపినప్పుడు మీరు వ్యంగ్యంగా పెట్టిన ట్వీటే మీ కొంప ముంచిందని గుర్తుంచుకోండి అంటూ హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news