సీఐడీ చీఫ్ సంజయ్ పై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర

-

సీఐడీ చీఫ్ సంజయ్ పై విరుచుకుపడ్డారు టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో పని చేసిన అధికారులపై కేసులెందుకు పెట్టలేదన్నారు ధూళిపాళ్ల. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 20 నెలల పాటు చంద్రబాబు ఊసే లేదు.స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిధుల దుర్వినియోగం జరగలేదని హైకోర్టు వివిధ సందర్భాల్లో చెప్పింది. అధికారులు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు..? సీఎం చెప్పారు కాబట్టే నిధులు విడుదల చేశామని ఐవైఆర్ చెప్పారని సంజయ్ వెల్లడించారు.. సీఎం చెబితే నిధులు విడుదల చేసేస్తారా..? ఒక వేళ నిధులు విడుదల చేయడం తప్పైతే అధికారుల పేర్లను ఎందుకు కేసులో పెట్టలేదు.
అంచనాలు పెంచింది తప్పని సంజయ్ అంటున్నారు.

అంచనాల మదింపు చేసి.. నిధులు విడుదల చేసింది ప్రేమ్ చంద్రారెడ్డే. ప్రేమ్ చంద్రారెడ్డి మూడు జీవోల ద్వారా నిధులు విడుదల చేశారు. ప్రేమ్ చంద్రారెడ్డి పేరును ఎఫ్ఐఆర్ లో ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నించారు. ప్రేమ్ చంద్రారెడ్డి మీ వాడని పెట్టలేదా..? అంచనాలు పెంచి ఉంటే ప్రేమ్ చంద్రారెడ్డిదే బాధ్యుడు. ఘంటా సుబ్బారావు వైఎస్ హయాంలో జవహర్ నాలెడ్జ్ సెంటరులో పని చేశారు.. అప్పుడు రాని అభ్యంతరం.. చంద్రబాబు దగ్గర పని చేస్తే తప్పైందా..?చంద్రబాబును ఇరికించాలి కాబట్టే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.ప్రతి రాష్ట్రంలోనూ సీమెన్సుతో చేసుకున్న ఒప్పందాలు ఒకే అంచనాతో చేసుకున్నారు. తాను తప్పు చేస్తున్నాననే భావన సీఐడీ చీఫ్ సంజయ్ లో కన్పిస్తోంది.ఒత్తిడితోనే చంద్రబాబును అరెస్ట్ చేశారనేది సంజయ్ ప్రెస్ మీట్ చూస్తూనే అర్థమవుతోంది.
గుజరాత్ రాష్ట్రంతో సహా ఎనిమిది రాష్ట్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అంశంలో సీమెన్స్ సంస్థ ఒప్పందాలు మొదలైంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎండీ కంప్లైంట్ ఎందుకివ్వలేదు అని ప్రశ్నించారు. నామినేటెడ్ పోస్ట్ తీసుకున్న వ్యక్తి ఫిర్యాదు చేయడం చాలా విచిత్రంగా ఉందన్నారు ధూళిపాళ.

Read more RELATED
Recommended to you

Latest news