ఎంపీ కేసినేని నానిపై దండెత్తిన తెలుగు తమ్ముళ్లు

-

విజయవాడ టిడిపి ఎంపీ కేసినేని నాని పై సొంత పార్టీ కార్యకర్తలే మండిపడుతున్నారు. ఇటీవల వైసిపి నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు పై కేసీనేని నాని ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. ఆయన కూడా కేశినేని నాని పై అదే తరహాలో పొగడ్తలు కురిపించారు. అయితే అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలిసి పని చేస్తానని కేసినేని నాని చెప్పడంతో ఆయన వ్యాఖ్యలను టిడిపి కార్యకర్తలు ఖండిస్తున్నారు. ఎంపీ చీకటి బాగోతం బయటపడిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

కేశినేని లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తూ వరుసగా పోస్టింగ్ లు పెడుతున్నారు. టిడిపి ఇన్చార్జిలతోనే సఖ్యత లేదని.. అధికార పార్టీ ఎమ్మెల్యేతో సంబంధాల అర్థం ఏమిటి ఎంపీ గారు..? అంటూ ప్రశ్నిస్తున్నారు. టిడిపి నేత విగ్రహాల తొలగింపు చేస్తున్న సంఘీభావం ఎందుకు తెలపలేదని, వసూలు బ్రదర్స్ కొండలు పిండి చేస్తుంటే అధికారులను కనీసం అడగలేదని.. ఈ ఎంపీ అవినీతిపరులకు సన్మానం చేసే టైప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version