బండి సంచలనం..సీట్లు వారికే..సీనియర్లకు చెక్.!

-

నెక్స్ట్ ఎన్నికల్లో తెలంగాణలో గెలిచి అధికారం సొంతం చేసుకోవాలని బి‌జే‌పి చూస్తున్న విషయం తెలిసిందే. బి‌ఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని చూస్తుంది. ఈ క్రమంలో అందివచ్చిన అవకాశాలతో రాజకీయం చేస్తూ ముందుకెళుతుంది. పార్టీని బలోపేతం చేస్తూ..ఎన్నికల్లో గెలిచేలా స్కెచ్ వేస్తున్నారు. ఇదే క్రమంలో బి‌జే‌పి అధిష్టానం నిర్ణయం అంటూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..సీట్ల విషయంలో బాంబు పేల్చారు.

ఈ సారి సీట్ల కోసం లాబీయింగ్‌లు చేయడం, బడా నేతలతో రికమండేషన్‌లు చేయించడం..సీనియర్ నేతలతో చెప్పించి సీట్లు దక్కించుకునే కాన్సెప్ట్ లేదని తేల్చి చెప్పేశారు. ఎవరికైతే ప్రజా బలం ఉంటుందో వారికే సీట్లు ఇస్తామని తేల్చి చెప్పేశారు. క్షేత్రస్థాయిలో పని చేయకుండా, లాబీయింగ్ చేసే నేతలకు టికెట్లు ఇవ్వకూడదని బిజెపి నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గం వారీగా సర్వేలు చేస్తూ ఆ నియోజకవర్గ ఓటర్ల అభిప్రాయాన్ని తెలుసుకుంటూ, ఎవరికైతే మెజారిటీ ప్రజలమద్దతు లభిస్తుందో వారికే టిక్కెట్లు ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు.

అంటే ఇంకా ఎవరు లాబీయింగ్ చేసిన వర్కౌట్ అవ్వదు అని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే పలువురు సీనియర్ల ద్వారా సీట్లు సంపాదించాలని కొందరు చూస్తున్నారు. ముఖ్యంగా ఈటల రాజేందర్ కోటరీలో చాలామంది నేతలు ఉన్నారు. వారంతా ఈటలపైనే ఆధారపడ్డారు. ఈటల తమకు సీట్లు ఇప్పిస్తారని భావిస్తున్నారు. కిషన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..ఇలా పలువురు నేతలు తమ తమ నేతలకు సీట్లు ఇప్పించుకోవాలని చూస్తున్నారు.

కానీ ఎవరికైనా సీటు దక్కాలంటే సర్వేలో మెజారిటీ రావాల్సిందే అని బండి కండిషన్ చెప్పేశారు. దీని బట్టి చూస్తే ఎవరికి సీటు వస్తుందో ముందే చెప్పలేని పరిస్తితి. అయితే ఎక్కువ స్థానాల్లో బి‌జే‌పికి పెద్ద బలం లేదు. అలాంటప్పుడు ఆ సీట్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version