జీతాలు అందక ఏపీలో ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నం…!

-

సకాలంలో జీతాలు అందక అనంతపురం జిల్లాకు చెందిన పాఠశాల ఉపాధ్యాయుడు మల్లేశం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని రఘురామకృష్ణ రాజు తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మోసపూరిత విధానాలతో, తడిగుడ్డతో గొంతు కోసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారన్నారు. తన చావుతోనైనా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా, చివరి నిమిషంలో ఆయన ఆసుపత్రిలో ప్రాణపాయస్థితి నుంచి బయటపడినట్టు రఘురామకృష్ణ రాజు గారు పేర్కొన్నారు.

మల్లేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. తల్లితండ్రుల తర్వాత గురువే దైవం అని భావించే ఈ సమాజంలో, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించకుండా 31 వేల కోట్ల రూపాయలు బకాయి పడిన ఘనత జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికే దక్కుతుందని, ప్రభుత్వ ఉద్యోగులు నాలుగు లక్షల మంది ఉంటే, అందులో రెండు లక్షల మంది పై చిలుకు ఉపాధ్యాయులే ఉంటారని, ఇంత పెద్ద మొత్తంలో బకాయిలను పెట్టుకొని, సకాలంలో జీతాలు చెల్లించకపోతే వారి పరిస్థితి ఏమిటి అని, ఇళ్ల నిర్మాణ రుణాలు, ఇతర బ్యాంకు రుణాలకు వారు నెలసరి వాయిదాలను ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news